కొన్నేళ్ల విరామం తర్వాత మళ్లీ నాగార్జున డ్యుయల్ రోల్ లో ఓ సినిమా వచ్చేస్తోంది. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో పక్కా మాస్ లుక్ లో నాగ్ నటిస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకుంది. ఈమధ్య రీషూట్స్ కూడా కంప్లీట్ చేసేశారు. ఇక రిలీజ్ చేయడమే తరువాయి. నవంబర్ లో చిన్న కొడుకు అఖిల్ సినిమా.. డిసెంబర్ లో పెద్ద కొడుకు నాగచైతన్య సినిమా రిలీజ్ అవుతుండడంతో… ఇక నాగార్జునే కాస్త ఆలస్యంగా జనవరిలో వస్తానంటున్నాడట.
‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని త్వరలోనే నాగ్ అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నాడు.continue reading
0 comments :
Post a Comment